30 April, 2026 | 1:41 AM

టెన్త్ ఫలితాల్లో రెసోనెన్స్ ప్రతిభ

30-04-2026 12:30 AM

ప్రతి నలుగురిలో ముగ్గురికి 500 పైగా మార్కులు

హైదరాబాద్, ఏప్రిల్ 29(విజయక్రాంతి): రాష్ట్ర ఎస్‌ఎస్సీ 2026 ఫలితాలలో రెసోనెన్స్ స్కూల్స్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ప్రతి నలుగురిలో ముగ్గురు 500 పైగా మార్కులు సాధించడం విశేషం. కృషి, పట్టుదల, క్రమశిక్షణ ఈ విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి.

ఈ సందర్భంగా మాదాపూర్ లో ఉన్న ఆశ్రయ కన్వెన్షన్‌లో పదో తరగతి ఫలితాల విజయోత్సవాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణ చంద్రరావు నర్రా మాట్లాడుతూ తెలంగాణ ఎస్ ఎస్సీ ఫలితాలు 2026లో మా విద్యార్థులు సాధించిన విజయంపై మాకు ఎంతో గర్వంగా ఉందన్నారు.

ముఖ్యంగా ప్రతి నలుగురిలో ముగ్గురు 500 పైగా మార్కులు సాధిం చడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇది విద్యార్థుల కృషి, అధ్యాపకుల అంకితభావానికి నిదర్శనమన్నారు. తల్లిదండ్రుల విశ్వా సం, సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మాదాపూర్, పటాన్‌చెరులోని క్యాంపస్‌లు గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా వంద శాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు.

నగరవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులో ఉండేలా మా స్కూల్ నెట్వ ర్క్ను విస్తరించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఎస్‌ఎస్సీ 2026లో ఉత్తీర్ణత సాధిం చారు. ప్రతి నలుగురిలో ముగ్గురు రెసోనెన్స్ స్కూల్ విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. తొమ్మి ది మంది విద్యార్థులు 580 మార్కు లు, అంతకంటే ఎక్కువ సాధించారు.47 మంది విద్యార్థులు 550 నుంచి 579 మార్కుల మధ్య సాధించారు. 60 మం ది విద్యార్థులు 500 నుంచి 549 మార్కుల మధ్య సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 71 శాతం మంది 500కు పైగా మా ర్కులు సాధించారు. మొత్తం విద్యార్థుల్లో 93 శాతం మంది 450కు పైగా మార్కులు సాధించారు.

అత్యధిక మార్కులు సాధించిన వారు..

సుష్మితా సింగ్ (హాల్ టికెట్ నెంబర్: 2616105195) 587/600, గడ్డే ప్రజ్ఞన్ (హాల్ టికెట్ నెంబర్: 2616105197) 586/600, జీ వేద సమ్హిత (హాల్ టికెట్ నెంబర్: 2616105281) 585/600, కే సహస్ర (హాల్ టికెట్ నెంబర్: 261610 6830) 585/600, దేవహర్ష్ బమ్మిడి (హాల్ టికెట్ నెంబర్: 261610 6079)  584/600, ఏ థాన్వి 583/ 600. కూర రాంసాయి రిషిత్‌రెడ్డి (హాల్ టికెట్ నెంబర్: 2616107128) 580/ 600, బండి ఆశ్రిత్ రామ్ (హాల్ టికెట్ నెంబర్: 261610 4115) 580/600, అన్విత రెడ్డి (హాల్ టికెట్ నెంబర్: 2616106912) 580/600.