22 April, 2026 | 2:47 AM

జేఈఈ మెయిన్‌లో ‘రెసోనెన్స్’ అద్భుత ప్రతిభ

22-04-2026 01:44 AM

ప్రతి క్యాంపస్ నుంచి అత్యుత్తమ ర్యాంకులు

హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): జేఈఈ మెయిన్ 2026లో ‘రెసోనెన్స్’ అద్భుత ప్రతిభ కనబరిచింది. ఆల్ ఇండియా ర్యాంక్ 12 సహా అనేక మంది విద్యార్థులు టాప్ 1000లో చోటు సంపాదించారు. 99 పర్సెంటైల్‌లో అధిక సంఖ్యలో విద్యార్థులు నిలిచారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్ ఈ మూడు సబ్జెక్టులలో విద్యార్థులు సమానంగా ప్రతిభ చూపారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని మాదాపూర్‌లో ని అశ్రయ కన్వెన్షన్స్‌లో వేడుకలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో విద్యార్థులను తల్లిదండ్రులు, అధ్యాపకుల సమక్షంలో సత్కరించారు. ఈ సందర్భంగా ఫిజిక్స్‌లో 100 పర్సెంటైల్ సాధించిన సాకేత్ రెడ్డికి రెసోనెన్స్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్ (తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్) డైరెక్టర్ పూర్ణచంద్రరావు చేతుల మీదుగా రూ. లక్ష నగదు బహుమతి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జేఈఈ మెయిన్ వంటి పరీక్షల్లో విజయం సాధించాలంటే నిరంతర శ్రమతో పాటు బేసిక్ అంశాలపై అవగాహన అవసరమన్నారు.

విద్యార్థులు ఈ రెండింటిపై దృష్టి పెట్టారన్నారు. రెసోనెన్స్లో ఫలితాలకే పరిమితం కాకుండా, విద్యార్థుల్లో బలమైన విద్యా పునాది ఏర్పడేలా కృషి చేస్తున్నామన్నారు. జాతీయ స్థాయిలో ధైర్యంగా పోటీ చేసే స్థాయికి వారిని తీర్చిదిద్దడం మా లక్ష్యమన్నారు. ఈ ఫలితాలు మా విద్యార్థుల కష్టానికి, అధ్యాపకుల మార్గదర్శకతకు నిదర్శనమన్నారు.జేఈఈ మెయిన్ ఫలితాల్లో మరోసారి విజయం సాధించామన్నారు. రెసోనెన్స్ హైదరాబాద్ ఐఐటీ-జేఈఈ అభ్యర్థుల కోసం ప్రాధాన్య ఎంపికగా నిలుస్తోందని పేర్కొన్నారు.

జేఈఈ మెయిన్ 2026 ఫలితాలలో ఆల్ ఇండియా ర్యాంక్ 12ను అభినవ్ చిత్తూరి సాధించారు. సాకేత్ రెడ్డి ఫిజిక్స్‌లో 100 పర్సెంటైల్ సాధించారు. 94 మంది విద్యార్థులు 99 పర్సెంటైల్‌కు పైగా సాధించారు.852 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో 99 పర్సెంటైల్ సాధించారు. రెసోనెన్స్ హైదరాబాద్ అన్ని క్యాంపస్‌ల నుంచి ఉత్తమ ఫలితాలు నమోదయ్యాయి. ఓపెన్ కేటగిరీలో టాప్ 1000లో నిలిచిన విద్యార్థులు, కేటగిరీలు అలాగే ఓపెన్ కేటగిరీలో టాప్ 1000లో నిలిచిన విద్యార్థులు, వారి ర్యాంకులు ఈవిధంగా ఉన్నాయి.

అభినవ్ చిత్తూరి - రోల్ నంబర్: 260310058 130 పర్సెంటైల్: 99.884 ఆల్ ఇండియా ర్యాంక్ : 12,బునేటి ఆదిత్య రెడ్డి - రోల్ నంబర్: 260310205390 పర్సెంటైల్: 99.918 ఆల్ ఇండియా ర్యాంక్ 147, శెట్టిపల్లి అన్విత రెడ్డి - రోల్ నంబర్: 260310198027 పర్సెంటైల్: 99.915 ఆల్ ఇండియా ర్యాంక్ 155, జీ ప్రగ్యేష్ - రోల్ నంబర్: 260310350962 పర్సెంటైల్: 99.54 ఆల్ ఇండియా ర్యాంక్ 184, సమృద్ధ్ భట్టాచార్య - రోల్ నంబర్: 260310 898375 పర్సెంటైల్: 99.988 ఆల్ ఇండియా ర్యాంక్ 242, రేవంత్ వంగాల - రోల్ నంబర్: 260310003887 పర్సెంటైల్: 99.981 ఆల్ ఇండియా ర్యాంక్ 365, స్నితిక - రోల్ నంబర్: 260310150320 పర్సెంటైల్: 96.261 ఆల్ ఇండియా ర్యాంక్ 476, అమరేంద్ర నాయక్ - రోల్ నంబర్: 260310054646 పర్సెంటైల్: 99.837 ఆల్ ఇండియా ర్యాంక్ 508,డీ వివస్వత్ - రోల్ నంబర్: 2603106 86940 పర్సెంటైల్: 99.833 ఆల్ ఇండియా ర్యాంక్ 529,రూపమ్ గాయెన్ - రోల్ నంబర్: 260310271004 పర్సెంటైల్: 98.612 ఆల్ ఇండియా ర్యాంక్ 622,మనస్విని - రోల్ నంబర్: 26031036 5317 పర్సెంటైల్: 99.804 ఆల్ ఇండియా ర్యాంక్ 630, డీ యశస్వి వర్ధన్ - రోల్ నంబర్: 260310569858 పర్సెంటైల్: 99.740 ఆల్ ఇండియా ర్యాంక్ 877, కే సాయి చరణ్ రెడ్డి - రోల్ నంబర్: 260310195442 పర్సెంటైల్: 99.517 ఆల్ ఇండియా ర్యాంక్ 943మరింత సమాచారానికి దయచేసి సంప్రదించండి : 9959154371 / 9963980259.