16 August, 2026 | 2:19 PM

మాజీ ప్రధాని వాజ్ పేయి సేవలు చిరస్మరణీయం

16-08-2026 01:03 PM

బిజెపి నేతల ఘన నివాళి..

తాండూరు, ఆగస్టు 16, (విజయకాంతి):  భారతరత్న, దివంగత మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ జిల్లా తాండూర్ బిజెపి నాయకులు అన్నారు. ఆదివారం వాజ్ పేయి 8 వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. పట్టణ శాఖ అధ్యక్షులు, మున్సిపల్ కౌన్సిలర్ నాగారం మల్లేశం మాట్లాడుతూ అగ్ర రాజ్యాల ఆదిపత్యాన్ని ఎదురొడ్డి పోక్రాన్ అణు పరీక్షలు నిర్వహించి ప్రపంచానికి భారత్ అంటే ఏంటో చూపించిన ఘనత ఆయనకే దక్కుతుందని ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కృష్ణ ముదిరాజ్, నాయకుడు బంటారం భద్రేశ్వర్, దోమ కృష్ణ, చిదిరి ప్రకాష్, ప్రహ్లాద్ జాదవ్, బండారు శ్రీకాంత్, మంతటి రాజు, ప్రభాకర్ గౌడ్,  కృష్ణ పటేల్, చందు, బబ్లు, సాయిలు, కార్యకర్తలు పాల్గొన్నారు.