22 April, 2026 | 2:47 AM

ఏసీబీకి పట్టుబడ్డ ఆర్డీవో

22-04-2026 01:42 AM

నారాయణపేట, ఏప్రిల్ 21(విజయక్రాంతి): ఏసీబీ దాడుల్లో నారాయణపేట జి ల్లా ఆర్డీవో రామచంద్రనాయక్ రూ.25000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఉట్కూరు గ్రామానికి చెందిన బాధితుడు మంగళవారం బర్త్ సర్టిఫికెట్ విషయంలో ఆర్డీవో రామచంద్రనాయక్‌ను ఆశ్రయించాడు.

ఆర్డీవో డబ్బులు డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఆధారాలు సేకరించిన ఏసీబీ డీఎస్పీ బాలక్రిష్ణ ఆధ్వర్యంలో నారాయణపేట ఆర్డీఓపై నిఘా ఏర్పాటు చేసి పట్టుకున్నారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ బాలకృష్ణ తెలిపారు.