8 April, 2026 | 9:26 PM

ప్రజా పాలనతో సమస్యల పరిష్కారం

08-04-2026 07:25 PM

సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో సమస్యలు పరిష్కారం చేసుకోవడంతోపాటు, అభివృద్ధి పనులు చేసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ అంతటి పుష్పలత అన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బుధవారం పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు, జూనియర్ కళాశాలతో పాటు  పలువాడలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక నిర్వహించారు, ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మున్సిపల్ కమిషనర్ రమేష్, పలువురు కౌన్సిలర్లు, వాకర్స్, మునిసిపల్ సిబ్బంది పాల్గొన్నారు.