ఆదివాసి తండాల సమస్యలు పరిష్కరించండి
23-03-2026 08:04 PM
నిర్మల్,(విజయక్రాంతి): పెంబి మండలంలోని ఆదివాసి గిరిజనగూడాల్లో సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవకు గిరిజనులు వినతి పత్రం అందించారు. చాలా గ్రామాల్లో రోడ్లు లేవని, విద్యుత్ సౌకర్యం లేదని వాగులపై వంతలను నిర్మించాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుదర్శన్ నూతన కుమార్ తిరుపతి శంభు తదితరులున్నారు.




