30 March, 2026 | 11:10 PM

మొదటి కౌన్సిల్ సమావేశంలో డంప్ యార్డ్ రద్దుకు తీర్మానం

30-03-2026 09:30 PM

హుజురాబాద్ ప్రజల హర్షం 

 అఖిలపక్ష నాయకుడు కౌన్సిలర్ గందే శ్రీనివాస్

హుజురాబాద్,(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మున్సిపాలిటీలో సోమవారం ఏర్పాటు చేసిన కౌన్సిల్ సమావేశంలో సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంప్ యార్డ్ నిర్మాణంపై పాలకవర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ ప్రాంత ప్రజల ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని మొదటి కౌన్సిల్ సమావేశంలో మొదటి అంశంగా డంప్ యార్డ్ రద్దును సభ్యులు తీర్మానించారు.

ఈ సందర్భంగా దీనికి సహకరించిన మున్సిపల్ చైర్ పర్సన్, పాలకవర్గానికి, మున్సిపల్ కమిషనర్కు ప్రజలు, అఖిలపక్ష నాయకులు కృతజ్ఞతలు తెలిపినట్లు కౌన్సిల్ గందె శ్రీనివాస్ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్షం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలకు హానికలిగించే ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ప్రజలు, ప్రభుత్వాలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.