మిషన్ భగీరథ లైన్ మరమ్మత్తులు
30-03-2026 09:27 PM
ఇల్లందు టౌన్, (విజయక్రాంతి): ఇల్లందు మండలం విజయలక్ష్మి నగర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ చందావత్ రమేష్ బాబు ఆధ్వర్యంలో మిషన్ భగీరథ వాటర్ లైన్ మరమ్మత్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవిలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు, నీటిని వృథా చేయకుండా అవసరం లేని చోట ట్యాపులు మూసివేయాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో సెక్రటరీ రజనీకాంత్ పాల్గొన్నారు.




