2 July, 2026 | 4:57 PM

Breaking News

ఆత్మలింగేశ్వర ఆలయ ప్రహరీ గోడకు నిధులు ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరిన ఆలయ కమిటీ సభ్యులు   •   అధిక సాంద్రత పత్తి సాగుతో దిగుబడి అధికం   •   గొర్తి ఈశ్వర ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థికి ప్రోత్సాహక బహుమతి అందజేత   •   "స్క్రాప్" పై అంత ప్రేమెందుకు..?   •   ఎల్లారెడ్డి మండలంలో జిల్లా కలెక్టర్ సుడిగాలి పర్యటన   •   యువత సమాజ సేవలో ముందుండాలి   •   పీ ఆర్సీ నివేదిక తెప్పించుకొని వెంటనే అమలు చేయాలి....   •   రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం   •   పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన   •   చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు   •  

42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి

08-10-2025 08:26 PM

న్యాయ‌వాది ఐలాపూర్‌ మాణిక్ యాదవ్..

అమీన్ పూర్: బీసీల‌కు 42 శాతం రిజ‌ర్వేష‌న్ అమ‌లు చేయాల‌ని న్యాయ‌వాది ఐలాపురం మాణిక్ యాద‌వ్ కోరారు. తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై విచారణ కొనసాగుతుండగా ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ బీసీ వర్గాల న్యాయం, చట్టపరమైన అంశాలపై స్పందించారు. బీసీలకు రాజకీయ ప్రాతినిధ్యం ఇవ్వడం అంటే సామాజిక న్యాయం చేయడమేన‌ని, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న 42 శాతం రిజర్వేషన్ అమలు అవ్వాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలాంటి బీసీ రిజర్వేషన్ కేసుల్లో కూడా ప్రభుత్వం తరఫున న్యాయపరమైన బలమైన వాదనలు వినిపించబడిన‌ట్లు తెలిపారు. అప్పట్లోనూ కోర్టులు 50 శాతం పరిమితి శాశ్వత నియమం కాదని, ప్రత్యేక పరిస్థితుల్లో రాష్ట్రాలు దాన్ని మించవచ్చని పేర్కొన్నారు. హైకోర్టు విచారణను తాము గౌరవిస్తున్నామ‌ని, కానీ బీసీల హక్కు తప్పక రక్షించబడాలని స్ప‌ష్టం చేశారు.