పట్టా ఉన్న రైతులకు భూమి అప్పగించాలి: సేవాలాల్ సేన
02-07-2026 04:43 PM
ఇల్లందు, జులై 2 (విజయక్రాంతి): ఇల్లందు మండలం ధనియాలపాడు గ్రామంలో సేవాలాల్ సేన జిల్లా అధ్యక్షుడు శివ నాయక్ పర్యటించి, పట్టా ఉన్నా భూమి దక్కని రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ, 1990కు ముందు పట్టాలు పొందిన రైతులకు వెంటనే రెవెన్యూ సర్వే నిర్వహించి భూమి స్వాధీనం కల్పించాలని, 4,200 ఎకరాల సీలింగ్ భూములపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. భూమి లేని గిరిజన, ఆదివాసీ నిరుపేదలకు సీలింగ్ భూములు పంపిణీ చేయాలని, రైతులకు న్యాయం జరిగే వరకు సేవాలాల్ సేన అఖిలపక్ష పోరాటానికి మద్దతుగా నిలుస్తుందని తెలిపారు.






