చెట్టే శాపమైందా..? ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు పగుళ్లు
02-07-2026 04:42 PM
బెజ్జంకి, జూలై 2: ప్రభుత్వం నిర్మించిన ఇందిరమ్మ మోడల్ హౌస్‌కు ఆనుకుని ఉన్న భారీ చెట్టు కారణంగా భవనం దెబ్బతిన్న ఘటన ఆందోళన కలిగిస్తోంది. చెట్టు ఒత్తిడి, కొమ్మల తాకిడి వల్ల ఇంటి పైభాగంలోని ప్రహరీ గోడకు భారీ పగుళ్లు ఏర్పడి కొంత భాగం విరిగిపోయింది. భవనం మొత్తం పైకప్పు భాగంలో కూడా పగుళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో భవిష్యత్తులో మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే భవనాన్ని పరిశీలించి, ప్రమాదకరమైన చెట్టును తొలగించి, దెబ్బతిన్న భాగాలను మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు.






