2 July, 2026 | 5:54 PM

రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు చేపించిన ఎమ్మెల్యేకు పాలాభిషేకం

02-07-2026 04:44 PM

ఖానాపూర్( విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం ఖానాపూర్ నుంచి తర్లపాడు గ్రామం వరకు, దాంతోపాటు బెల్లాల్ గ్రామ లకు నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి అలాగే ఖానాపూర్ నూతన ఎమ్మార్వో భవనానికి నిధులు మంజూరు చేపించిన ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఖానాపూర్ కాంగ్రెస్ మండల నాయకులు గురువారం స్థానిక మార్కెట్ యార్డ్ కూడలి వద్ద ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షులు జంగిలి శంకర్ మాట్లాడుతూ నిరంతరం మండల అభివృద్ధికి ప్రత్యేక  ప్రణాళిక తో పాటుపడుతున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ అభినందనీయుడని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిసిసి ఉపాధ్యక్షులు రాజుర సత్యం, అధికార ప్రతినిధి దొనికేని దయానంద్ ,ఆత్మ కమిటీ చైర్మన్ తోట సత్యం, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు రాజు నాయక్, కౌన్సిలర్లు నిమ్మల రమేష్, సర్పంచులు ప్రశాంత్ రెడ్డి, చింతల మల్లేష్, అర్జున్, కావలి సంతోష్, నేరెళ్ల సత్యనారాయణ, షబ్బీర్ పాష, అమానుల ఖాన్, మడిగెల గంగాధర్, జహీర్ ఖాన్, లక్ష్మీపతి, మధిర సత్యనారాయణ ,దేవతి రాజేశ్వర్, నేత శ్యామ్, శ్రీహరి, నబీఖాన్ , తదితరులు ఉన్నారు.