4 March, 2026 | 11:35 AM

జాతీయ అభివృద్ధికి పరిశోధనలు కీలకం

04-03-2026 12:56 AM

చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ  వైస్ ఛాన్సలర్ జీ.శంకర్ లింగం 

మొయినాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): పరిశోధనలు సమాజానికి దిక్సూచిలాగా ఉపయోగపడాలని చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీ.శంకర్ లింగం పేర్కొన్నారు. మొయినాబాద్ మున్సిపల్ పరిధిలోని హిమాయత్ నగర్ లో గల చైతన్య డీమ్డ్ టూబీ యూనివర్సిటీలో ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో ‘ ఏ నావెల్ అడాప్టివ్ కంట్రోల్ మెథడ్ ఫర్ ఎ సింగిల్ పేజ్ సింగిల్ స్టేజ్ మల్టీ ఫంక్షనల్ గ్రిడ్ ఇంటరాక్టివ్ యస్పిని సిస్టమ్‘ అనే సిద్ధాంతానికి నవీన్ కుమార్ దిద్దికి పీహెచ్డీ డిగ్రీ పట్టా లభించగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీ.శంకర్ లింగం అధికారికంగా ప్రధానం చేశారు.

ఈ పరిశోధన డాక్టర్ కె.వి.ఎన్.ఎస్. పవన్ కుమార్ పర్యవేక్షణలో జరిగింది. దీంతో యూనివర్సిటీ ఛాన్సలర్ సిహెచ్.వీ పురుషోత్తం రెడ్డి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్.సాత్వికారెడ్డిలు అభినందించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జీ.శంకర్ లింగం మాట్లాడుతూ.. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ విభాగంలో పరిశోధనలు జాతీయ అభివృద్ధికి ఎంతో కీలకమన్నారు. సింగిల్-పేజ్ సింగిల్-స్టేజ్ మల్టీ ఫంక్షన్ ఇంటరాక్టివ్ సోలార్ ఫోటో వోల్టాయిక్ (ఎస్పివి) వ్యవస్థ కోసం కొత్తగా ప్రతిపాదించబడిన అడాప్టివ్ కంట్రోల్ పద్ధతి ఈ రంగంలో గణనీయమైన పురోగతిని సూచిస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ పద్ధతి ద్వారా వ్యవస్థ, స్థిరత్వం, సామర్థ్యం మరియు విద్యుత్ నాణ్యతను పెంచుతుందని ఆయన తెలిపారు. అదనంగా పరిశోధన గ్రిడ్ సింక్రోనైజేషన్ హార్మోనిక్ తగ్గింపు మరియు రియాక్టివ్ పవర్ కాంపెన్సేషన్లో మెరుగైన పనితీరును ప్రదర్శిస్తుందని, ఇది చాలా ప్రశంసనీయమైన అభివృద్ధి మరియు పరిశోధన ప్రయత్నాలు ప్రజల అంచనాలను మరియు సంక్షేమాన్ని ప్రతిబింబించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్టర్ యం.రవీందర్, ఆచార్య క్రిస్టోఫర్, ఏ.రాజు, ఏం.జగదీశ్వర్, బి.చంద్రమౌళి, సుదీప్తిచంద్, పవన్ కుమార్, డాక్టర్ సిహెచ్.రామకృష్ణారెడ్డి, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ గాదె రాంబాబు రెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.