సెలవుల్లో స్కూల్ రన్.. చర్యలు నిల్
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుర్వ మహిపాల్ చర్యలు తీసుకోవాలని ఏబీవీపి డిమాండ్
చేవెళ్ళ మార్చి 3 (విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా నడిపిస్తూ పిల్లలపై ఒత్తిడి చేస్తున్న శ్రీ చైతన్య టెక్నోస్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహిపాల్ తెలిపారు. ప్రభుత్వం ఆదివారం హోలీ పండుగ రోజులలో సెలవులు ప్రకటిస్తే పట్టించు కోకుండా విద్యార్థులను ఒత్తిడికి గురి చేస్తున్నారు.
చేవెళ్ల నగర కేంద్రంలో మంగళవారం హోలీ పండుగకు సెలవులు ప్రకటిస్తే శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మాత్రం ప్రభుత్వ నిబంధనలు బేఖాతార్ చేస్తూ పాఠశాల నడిపిస్తున్నారు. మంగళవారం ఏబీవీపి యాజ మాన్యం విధానం తప్పుబాడుతూ పాఠశాలను బందు చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ... కార్పొరేట్ విద్యా సంస్థలు విద్య వ్యవస్థను శాసిస్తున్నాయన్నారు. ప్రభుత్వ అధికారులకు చిత్తశుద్ధి లేక దర్జాగా ఇస్టానుసార రీతిలో పాఠశాలలు నడుపుతూ... విద్యార్థులను ఒత్తిడికి గురి చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది ఇలాగే కొనసాగితే విద్యార్థులు మానసికంగా ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి హారిక, అనిల్, హరికృష్ణ మల్లేష్, మందిర్, లోకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.




