13-02-2026 12:00:00 AM
బూర్గంపాడు, ఫిబ్రవరి12, (విజయక్రాంతి): బూర్గంపాడు మండలం కృష్ణసాగర్ పంచాయతీ పరిధిలోని భట్టిగూడెం గ్రామానికి సంబంధించిన పలు సమస్యల పరిష్కరించాలని కోరుతూ గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు గ్రామ ప్రజలు వినతి పత్రం సమర్పించారు.
గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించి, మౌలిక వసతులు మెరుగుపర చాలని కోరారు. గ్రామ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం మాజీ ఉపసర్పంచ్ పోతిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.