calender_icon.png 13 February, 2026 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సంగమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తరలిరండి

13-02-2026 12:00:00 AM

మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డికి ఆహ్వాన పత్రిక అందజేత

మెదక్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండల పరిధిలోని రుద్రారం గ్రామంలో ఈనెల 15 వ తేదీన ఆదివారం రోజున నిర్వహించే శ్రీ కామేశ్వరీదేవి సమేత సంగమేశ్వరస్వామి బ్ర హ్మోత్సవములు జాతర, 77వ వార్షికోత్సవానికి రావాల్సిందిగా మాజీ డిప్యూటీ స్పీక ర్, బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మాదేవేందర్ రెడ్డిని వారి నివాసం హైదరాబాద్ కొంపల్లిలో గురువారం శంకరంపే ట్ ఆర్ మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రా జు, ఆలయ కమిటీ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలసి ఆహ్వాన పత్రికను అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీ కామేశ్వరీదేవి సమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవముల జాత ర ఆలయ వార్షికోత్సవానికి రావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు నవీన్ ప్రవీణ్, శ్రీనివాస్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు ఉన్నారు.