13-02-2026 12:00:00 AM
మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని ఆరోపణ
నారాయణఖేడ్, ఫిబ్రవరి 12: నారాయణఖేడ్ పట్టణంలోని జూకల్ శివారులో కల గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు గురువారం నారాయణఖేడ్ నిజాంపేట్ ప్రధాన రహదారిపై అన్నం వడ్డించిన గిన్నెలతో నిరసన వ్యక్తం చేసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశ్రమ పాఠశాలలో గత కొన్నాళ్లుగా తమకు నాణతా లోపమైన ఆహారాన్ని వడ్డిస్తున్నారని ఆరోపించారు.
స్థానిక ఆశ్రమ పా ఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఫుడ్ సే ఫ్టీ కమిటీ సభ్యులు ఎవరు పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను తీ ర్చాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ప్ర ధాన రహదారిపై సుమారు గంట పాటు జాతీయ రహదారిపై నిరసనను వ్యక్తం చేశారు. దీంతో స్థానిక అధికారులు స్పందించి విద్యార్థులను సముదాయించడంతో సమస్య సద్దుమణిగింది. కాగా మధ్యాహ్నం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వర్షం పాఠశాలను సందర్శించి వివరాలను సేకరించారు.