వార్డెన్‌పై చర్యలు తీసుకోవాలని వినతి
13-08-2026 12:00 AM
బోధన్ ఆగస్టు 12 (విజయ క్రాంతి): చందూర్ బీసీ బాలుర వసతి గృహ వార్డ్పె తక్షణమే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి ఫ్రంట్ నాయకులు కోరారు. బుధవారం రోజున బోధన్ ఆర్డీవో ఏం.విజయ కుమారిని కలసి వినతిపత్రం అందజేశారు. ఈ నెల 11వ తేదీన వార్డెన్ విద్యార్థులపై తప్పుడు ఆరోపణలు చేస్తూ, అనుచిత పదజాలంతో దూషిస్తూ 10 మంది విద్యార్థులపై దౌర్జన్యంగా దాడి చేసి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.






