శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైన కోటగుళ్ళు
ఈనెల 13 నుండి శ్రావణమాసం ప్రారంభం
ఆలయంలో నెల రోజులపాటు ఉత్సవాలు
ప్రతి శ్రావణ శుక్ర, సోమవారాల్లో స్వామివారికి ప్రత్యేక అలంకరణ
ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్న కోటగుళ్లు పరిరక్షణ కమిటీ
గణపురం,ఆగస్టు 13 (విజయక్రాంతి): ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు దేవాలయం శ్రావణ మాస ఉత్సవాలకు ముస్తాబైంది. ఆగస్టు 13 గురువారం నుండి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కాగా సెప్టెంబర్ 11 వరకు నెల రోజులపాటు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రతి శుక్రవారం, సోమవారాల్లో స్వామివారికి పట్టు వస్త్రాలతో ప్రత్యేక అలంకరణ,గోశాల గోమాతలకు పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదేవిధంగా శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్నారు.






