13 August, 2026 | 11:21 AM

అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్ మంజూరు చేయాలి

13-08-2026 10:51 AM

పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి డిమాండ్

గుండాల, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షల 50 వేల ఆసరా పింఛన్ మంజూరు చేస్తామని ప్రకటించడం పట్ల ప్రగతిశీల యువజన సంఘం (పీవైఎల్) జిల్లా కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా పీవైఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పర్శక రవి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల హామీలల్లో ఆసరా పింఛన్ కేసీఆర్ ప్రభుత్వం రెండు వేల రూపాయలు ఇస్తుందని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల రూపాయలకు బదులు నాలుగు వేలు ఇస్తామని ప్రకటించారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారని, వెంటనే ఆసరా పింఛన్ వృద్ధులకు నాలుగు వేల రూపాయలు, వికలాంగులకు ఆరు వేలు రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఆసరా పింఛన్లు రెండు లక్షల 50 వేలు ఇస్తామని డెడ్ లైన్ పెట్టి చాటలో నూకలు పోసి పిచ్చుకలకు పంచాయతీ పెట్టే విధంగా కాకుండా  అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి పెన్షన్స్ ఇవ్వాలని కోరారు.