నీటి సమస్యను పరిష్కరించాలని వినతి
మేడ్చల్ అర్బన్ మార్చి 12(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ లో మంచినీటి సమస్యను పరిష్కరించాలని బిఆర్‌ఎస్ పార్టీ నాయకులు జిల్లా మాజీ గ్రంథాలయ మాజీ చైర్మన్ బి భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ మహానగర మంచినీటి సరఫరా మండలి మేనేజింగ్ డైరెక్టర్ కె అశోక్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. మేడ్చల్ పట్టణంలో పేద ప్రజలకు మంచినీటి సరఫరా చేయాలని మురుగునీటి కాలువలను శుభ్రం చేయాలని కోరారు.
మేడ్చల్ పట్టణంలో మంచినీటి సరఫరా సంవత్సర పరిష్కారం కోసం వినతిపత్రం అందజేసిన వెంటనే డైరెక్టర్ అశోక్ రెడ్డి స్పందిస్తూ రెండు మూడు రోజుల్లో మేడ్చల్ పట్టణ ప్రజలకు మంచినీటిని విడుదల చేస్తామని హామీ ఇచ్చినట్లు భాస్కర్ యాదవ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు చీర్ల దయానంద యాదవ్.మున్సిపల్ మాజీ కో ఆప్షన్ సభ్యులు నవీన్ రెడ్డి.సీనియర్ నాయకులు మోహన్ రెడ్డి పాల్గొన్నారు.




