18-02-2026 12:00:00 AM
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి సూర్యా ఘర్ ముక్త్ బిజిలీ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ మీటర్లు అంద చేయాలని డి ఈ కి బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు. సోలార్ పవర్ ప్లాంట్లకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం టు వే మీటర్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తుందని వారు పేర్కొన్నారు.
ఏడాది నుంచి మీటర్లు ఇవ్వకపోవడం విచారకరమన్నారు. మీటర్లు ఇవ్వకుంటే ఉద్యమం చేపడతామని వారు స్పష్టం చేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో చేరుకొమ్ము శ్రీనివాస్ గౌడ్, జాకాట ప్రేమ దాస్ తదితరులు ఉన్నారు.