18-02-2026 12:00:00 AM
మేడిపల్లి ఫిబ్రవరి 17 (విజయక్రాంతి): కుటుంబ కలహాలతో తల్లి తన కూతురితో సహా అదృష్టమైన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మహమ్మద్ వసీం అక్రమ్ ఖాన్ (29 )గణపతి కాలనీ, హేమ నగర్ లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. తనకు వివాహమై 3 సంవత్సరాలు అవుతుందని, 1 సంవత్సరం 6 నెలల పాప ఉందని పేర్కొన్నాడు.
గత కొన్ని నెలలుగా తన భార్య మలైక (21), ఒక వ్యక్తితో తరచూ ఫోన్ మాట్లాడు తుండడంతో ఇదే విషయంలో భార్యను ప్రశ్నించగా ఆమె ఖండించిందని, ఈ నెల 15న సాయంత్రం నాలుగు గంటలకు భార్య తన కుమార్తెతో కలిసి ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని. వారి కోసం వివిధ ప్రాంతాల్లో వెతికిన ఆచూకి దొరకలేదని, భర్త మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు ప్రారంభించామని మేడిపల్లి సిఐ గోవిందరెడ్డి తెలిపారు.