26 April, 2026 | 7:48 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

కంపెనీల అనుమతుల రద్దుకు ఎమ్మెల్యేకు వినతి

05-03-2026 12:32 AM

భిక్కనూర్, మార్చి 4 (విజయక్రాంతి): భిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా అనుమతులు పొందిన పలు కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం పెద్దమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డికు వినతి పత్రం అందజేశారు. ఎంఎస్‌ఎన్, ఫ్యూజన్ ఫార్మా, జెన్స్ అడ్సార్ప్షన్, వేదా గ్రానెట్ కంపెనీల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటూ గ్రామ సభలో తీర్మానం చేశారు. బుధవారం భిక్కనూర్ రైతు వేదికలో జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈ వినతిని అందజేసి పచ్చని పల్లెలను కాపాడాలని కోరారు.