10 August, 2026 | 6:48 PM

డంపింగ్‌యార్డు మూసివేయాలని వినతి

10-08-2026 12:00 AM

జవహర్‌నగర్, ఆగస్టు 9 (విజయక్రాం తి): ప్రజల ప్రాణాలు, వారి ఆరోగ్య భద్రత తో చెలగాటమాడుతున్న జవహర్ నగర్  రాంకీ చెత్త డంపింగ్ యార్డు మూసివేతకు అవసరమైన చర్యలను వెంటనే చేపట్టాలని ఎంపీ ఈటల రాజెందర్‌కు జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ ప్రతినిధులు ఆదివారం వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ మేరకు డంపింగ్ యార్డు ఎత్తివేత పోరాట కమిటిలోని భాగస్వామ్య సంస్థల నాయకులు చైర్మన్ షేక్ షావలి ఆధ్వర్యంలో ఈటలను శామీర్‌పేటలోని ఆయన నివాసంలో కలిసి వినతి చేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాజశేఖర్,  సిపిఐ(ఎం.ఎల్) మాస్ లైన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సదానందం, సిపిఐ శంకర్, పిడిఎం చంద్రమౌళి ఏ.ఐ.ఎఫ్.టి. యు మల్లేష్, పిఓడబ్ల్యూ జయసుధ, సిఎంఎస్ ఇ.జయ, పిఓడబ్ల్యూ గడిపే సునిత, టియుసిఐ వి.ప్రవీణ్, బి.ఎన్.ఆర్.కె. ఎస్. వెంకటయ్య, మాజీ ఉపసర్పంచ్ నర్సింహ్మ గౌడ్, శ్రీనివాస్, కార్మికనగర్ ప్రబాకర్, జర్నలిస్ట్ వేణు తదితరులు పాల్గొన్నారు.