9 May, 2026 | 10:29 AM

Breaking News

గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •   రాష్ట్రంలో శాంతిభద్రతలు దిగజారాయి   •   తమిళనాట తికమక!   •   భయం అవుట్ భరోసా ఇన్   •   రైతులకు మద్దతు ఏదీ?   •   ఇంటర్ విద్యకు మంగళం!   •  

నిధులు మంజూరు చేయాలని వినతి

20-11-2025 01:03 AM

ఉప్పల్ నవంబర్ 19 (విజయక్రాంతి) : ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని నాచారం కార్పొరేటర్ శాంతి సాయి జెన్ శేఖర్ జిహెచ్‌ఎంసి కమిషనర్ కర్ణన్ బుధవారంనాడు కలిసి వినపత్రం అందించారు. డివిజన్లోని సమస్యలను కార్పొరేటర్ శాంతి కమిషను దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు తుచ తప్పకుండా నెరవేర్చడమే తమ ప్రధాన లక్ష్యం అన్నారు.

ప్రధానంగా రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం అన్నపూర్ణ కాలనీ హెచ్‌ఎంటి కాలనీ పెద్ద చెరువు బఫర్ జోన్ థీమ్ పార్క్ ఎర్రకుంట స్మశాన వాటిక వైకుంఠధామగా తీర్చే విషయంపై కమిషనర్ తోని మాట్లాడాను అన్నారు. పటేల్ కుంట చెరువు పక్కనుండి కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సివర్ లైన్ డైవర్షన్ పనులు కూడా ఇంకో పది శాతం మిగిలి ఉన్నాయి అని నిధులు మంజూరు అయితే అట్టి పనులు కూడా పూర్తి అవుతాయని కమిషనకు తెలియజేశామని ఆమె పేర్కొన్నారు. అన్ని విషయాలపై కమిషనర్ సానుకూలంగా స్పందించి కాప్రా జోనల్ కమిషనర్‌కు సమస్యలు పరిష్కారంచాలి ఆదేశాలు జారీ చేశారని కార్పొరేటర్ శాంతి తెలిపారు.