9 May, 2026 | 11:25 AM

Breaking News

కరీంనగర్ బంద్ ప్రశాంతం   •   పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణస్వీకారం.. పాల్గొన్న ప్రధాని మోదీ   •   ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం   •   కొత్త సీడీఎస్‌గా రాజా సుబ్రమణి నియామకం   •   నేవీ చీఫ్‌గా వైస్ అడ్మిర‌ల్ కృష్ణస్వామినాథ‌న్ నియామ‌కం   •   గర్భం దాల్చిన మైనర్ బాలిక... యువకుడిపై కేసు నమోదు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. మాజీమంత్రి గంగుల హౌస్ అరెస్ట్   •   తమిళనాడులో పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్.. అధికారానికి అడుగు దూరంలో విజయ్!   •   నామకరణ మహోత్సవంలో పాల్గొన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్   •   ట్రిపుల్ ICG ఫ్లోరెసెన్స్ సాంకేతికతతో రోబోటిక్ ఈసోఫేజియల్ క్యాన్సర్ శస్త్రచికిత్సలో ప్రపంచస్థాయి ప్రమాణాన్ని నెలకొల్పిన హైదరాబాద్ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ (AOI)   •  

బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లా లక్ష్యాలను సాధించాలి

20-11-2025 01:03 AM

జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, నవంబర్ 19 (విజయక్రాంతి): బ్యాంకర్లు, జిల్లా అధికారులు స మన్వయంతో కలిసి పనిచేసి జిల్లా ఆర్థిక లక్ష్యాలను సాధించాలని, రుణాల పంపిణీ లో నిర్దేశిత పూర్తి స్థాయిలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ అద్వైత్ కు మార్ సింగ్ సూచించారు. వ్యవసాయ, హార్టికల్చర్, సెరికల్చర్, ముద్ర, ఎస్సీ, ఎస్టీ కార్పొ రేషన్, పీఎంఈజీపి, స్వయం సహాయక బృందాల లింకేజ్, పీఎం స్వనిది తదితర రు ణాలు పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బుధ వారం జిల్లా స్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ త్రైమాసిక సమావేశం జరిగింది. జి ల్లా లక్ష్యాలు, సాధించిన ప్రగతి, రానున్న సీజన్ లో రైతాంగానికి అందించాల్సిన పం ట రుణాలు తదితర అంశాలపై ఆయా బ్యాంకుల వారీగా కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో ఇప్పటివరకు క్రాఫ్ లోన్స్ 43,91 శాతం, అగ్రికల్చర్ టర్మ్ లోన్స్ 57.96 శాతం, స్వయం సహాయక సంఘాల రుణా లు 47.99 శాతం, పీఎం స్వనిది 99.53 శాతం లక్ష్యాన్ని పూర్తి చేశారన్నారు. పూర్తి స్థాయిలో పంట రుణాల లక్ష్యాన్ని సాధించేందుకు బ్యాంకర్లు చొరవ చూపాలని, రుణ పంపిణీ లక్ష్యాన్ని అధిగమించాలన్నారు.

ఆయా రంగాల్లో పలు బ్యాంకులు లక్ష్యానికి అనుగుణంగా రుణాలు అందిస్తుండగా, మ రికొన్ని బ్యాంకులు వెనుకంజలో ఉండిపోతున్నాయన్నారు. క్రమం తప్పకుండా సమీక్ష జరుపుతూ, వంద శాతం లక్ష్యాల సాధనకు కృషి చేయాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు బ్యాంకింగ్ సేవలను సమర్ధవంతంగా అందించాలన్నారు. వ్యవసాయ శాఖతో పాటు పశు సంవర్ధక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర శాఖలతో సమన్వయము చేసుకుని ప్రభుత్వ పథకాల కింద ఎంపికైన లబ్దిదారులకు సకాలంలో రుణా లు అందించి స్వయం ఉపాధికి చేయూతనివ్వాలన్నారు.

రుణాలు తీసుకున్న వారు యూనిట్లు స్థాపించారా లేదా అన్నది నిశితంగా పరిశీలించాలని సంబంధిత అధికారు లకు సూచించారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తి స్థాయిలో లింకేజీ రుణా లు పంపిణీ చేయాలని,సబ్సిడీ రుణాల పం పిణీలో జాప్యం చేయవద్దని సూచించారు. వీధి వ్యాపారులకు విరివిగా ముద్ర రుణాలతో పాటు స్టాండ్ అప్ ఇండియా కింద రు ణాలు అందించాలన్నారు. కూరగాయలు పంటలవిభాగం కు చెందిన రుణాలను త్వర గా రైతులకు అందించేందుకు క్షేత్రస్థాయిలో ప్రణాళికా ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ కె.అనిల్ కుమార్, ఆర్బీఐ ఎల్.డీ.ఓ డిబోజిత్ బారువ, డీఆర్డీఓ మధుసూదన రాజు, లీడ్ బ్యాంక్ జిల్లా మేనేజర్ కె.యాదగిరి, నాబా ర్డు ఏజీఎం చైతన్య రవి, డిఏఓ విజయనిర్మల, డివిహెచ్‌ఓ డాక్టర్ కిరణ్ కుమార్, డి హెచ్‌ఓ జి.మరియన్న, మెప్మా పీడీ విజయ, ట్రైబల్ వెల్ఫేర్ దేశి రామ్ నాయక్, జిల్లా పరిశ్రమల కేంద్రం మేనేజర్ శ్రీమన్నారాయణ రెడ్డి, యుబీఐ డీజీఎం కమలాకర్, డిసీసీబి బి.కృష్ణమోహన్, సిఎఫ్‌ఎల్ కౌన్సిలర్స్ షరీ ఫ్, వేణు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.