23-02-2026 01:31:02 PM
శ్రీపాద కాలనీ లో ప్రజల, భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయండి
మంథని విద్యార్థి నాయకుడు డిగంబర్
మంథని,(విజయక్రాంతి): మంథని శ్రీపాద కాలనీలో ప్రజలు, భక్తుల సౌకర్యార్థం వాటర్ ట్యాంక్(water tank) ఏర్పాటు చేయాలని మంథని విద్యార్థి నాయకుడు డిగంబర్ మున్సిపల్ పాలక వర్గాన్ని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీపాద కాలనీ లో మెయిన్ రోడ్డు లోపల గల పోచమ్మ టెంపుల్ వద్ద భక్తుల సౌకర్యార్థం ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని వీధి ప్రజల కొరకు వాటర్ ట్యాంక్ (సింటెక్స్) ఏర్పాటు చేయాలని కోరుతూ సోమవారం మంథని పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ ఓడ్నాల శ్రీనివాస్ కు వైస్ చైర్మన్ ముస్కుల సహేందర్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఆయన వెంట కౌన్సిలర్ కుర్ర లింగయ్య ఉన్నారు.