20 May, 2026 | 8:02 PM

అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

20-05-2026 06:54 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): అంగన్వాడీలతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి పని చేయించుకుంటున్నాయే తప్ప వారి సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదని CITU జిల్లా కార్యదర్శి అన్నమొల్ల కిరణ్ అన్నారు. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ & హెల్పర్స్ యూనియన్ CITU తెలంగాణా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ ను కలిసి CITU అంగన్వాడీ యూనియన్ నాయకత్వం వినతి పత్రాన్ని అందజేశారు. ఇచ్చే అరకొర వేతనాలను కూడా సక్రమంగా చెల్లించడం లేదని, పెండింగ్ లో ఉన్న ఏప్రిల్ నెల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రతినెల 1వ తేదీన అంగన్వాడి ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలను, కాంగ్రెస్ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా రూ. 18,000 వేతనం పెంచాలని, పిఎఫ్ పిఎస్ఐ సౌకర్యం కల్పించాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్ హెల్పర్స్ కు గ్రాట్యూటి చెల్లించాలని, జీవో నెంబర్ 14 సవరించి అంగన్వాడి టీచర్స్&హెల్పర్స్ ఉద్యోగ భద్రత కల్పించారు. MLA సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీత, CITU సహాయ కార్యదర్శి రేసు సురేందర్, నాయకులు విమల, సుజాత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.