శాసన మండలి చైర్మన్ ‘గుత్తా’కు వినతి పత్రం
చిట్యాల, ఆగస్ట్ 20 : చిట్యాల చేనేత సహకార సంఘం భవన నిర్మాణానికి తమ వంతుగా ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించాలని సంఘం అధ్యక్షుడు గంజి సుధాకర్ , ప్రధాన కార్యదర్శి చెరుపల్లి శ్రీనివాస్ తెలంగాణ శాసన మండలి ఛైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కి గురువారం వినతి పత్రం చేశారు.
ఈ మేరకు చిట్యాల లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములతో కలిసి గురువారం సంఘం సభ్యులు వినతిపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు మిర్యాల వెంకటేశ్వర్లు, డైరెక్టర్ మిర్యాల ప్రకాశ్, గంజి కనకయ్య, గంజి గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
టీటీడీ కళ్యాణ మండప వివాదానికి తెరదించిన గుత్తా సుఖేందర్ రెడ్డి
చిట్యాల, ఆగస్టు 20: చిట్యాల పట్టణంలోని 649 సర్వే నంబర్లో టీటీడీ కళ్యాణ మండపం కోసం కొనుగోలు చేసిన ఎకరం 12 గుంటల భూమిపై నెలకొన్న వివాదానికి శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తెరదించారు. గురువారం తన ఫామ్హౌస్లో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎ మ్మెల్యే వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్సీ చెరుపల్లి సీతారాములుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
2002లో ప్రజల సౌకర్యార్థం టీటీడీ కళ్యాణ మండపం నిర్మించేందుకు దాతల స హకారంతో భువనగిరి రోడ్డులోని సర్వే నంబర్ 649లో ఎకరం 12 గుంటల భూమిని రూ.2.50 లక్షలకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు గుత్తా తెలిపారు. అయితే రిజిస్ట్రేషన్ ప్ర క్రియలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా భూమి సమస్య తలెత్తిందన్నారు. ప్రస్తుతం రోడ్డు ఫేసిం గ్లో ఉన్న భూమిలో కొంత భాగం ఆక్రమణకు గురైనట్లు వచ్చిన ఆరోపణలపై స్పందించిన గుత్తా..
భూమిని పూర్తిస్థాయిలో సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, ఆక్రమణకు సంబంధించిన ఫెన్సింగ్ను తొలగించి ఎకరం 12 గుంటల భూమికి తిరిగి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని రెవెన్యూ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ భూమిని పట్టణ అవసరాలకు మున్సిపల్ పాలకవర్గ తీర్మానం మేరకు వినియోగిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మితో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.






