22 July, 2026 | 1:37 AM

‘ఆటా’ అంతర్జాతీయ వేదికపై మాతృభూమి రుణం

22-07-2026 12:40 AM

రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి

కడ్తాల్, జూలై 21 (విజయక్రాం తి): అమెరికాలోని బాల్టిమో ర్లో జులై 31 నుం చి ఆగస్టు 2 వర కు నిర్వహించనున్న 19వ ‘ఆటా యూత్ కన్వెన్షన్2026’ వేడుకలకు రాష్ట్ర సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డికి ఆహ్వానం దక్కింది. ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ కిషోర్ గూడూరు ఈ ఆహ్వానాన్ని అందించినట్లు ఆయన తెలిపారు.

గతంలో కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల్, ముద్విన్ పరిధిలో డిజిటల్ తరగతుల ఏర్పాటు, ఉచిత విద్యా సామగ్రి పంపిణీ, నిరుద్యోగులకు ఉపాధి కల్పన వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు గాను తనకు ఈ గౌరవం లభించిందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూప్రవాస భారతీయులు తమ సొంత గడ్డపై సే వా కార్యక్రమాలను మరింత విస్తరించాలని, ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనపై ‘ఆటా’ వేదికగా గళం విప్పుతానని స్పష్టం చేశారు.