22 July, 2026 | 1:42 AM

అఫ్గాన్‌లో వరదలు

22-07-2026 01:31 AM

33మంది మృతి

600 ఇళ్లు ధ్వంసం

కాబూల్, జూలై 21: అఫ్గానిస్థాన్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరదలు సంభవించాయి. తూర్పు ప్రాంతంలోని సూరిస్థాన్ ప్రావిన్స్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల 33 మంది మృతి చెందగా, 80 మందికి పైగా గాయపడ్డారు. వందలాదిమంది గల్లంతయ్యారు. పరున్ నగర మేయర్ కూడా గల్లంతయ్యారని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి అబ్దుల్లా జనన్ సాయెఖ్ మంగళవారం ప్రకటించారు.

భారీ వర్షాలు, వరదలతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేశామన్నారు. రాజధాని కాబూల్‌తో సహా పశ్చిమ ఫరా, హెరాత్, దక్షిణ జాబుల్, కందహార్ ప్రావిన్సులలో వరదల వల్ల అత్యధిక నష్టం వాటిల్లిందని, 85 కి.మీ. మేర రోడ్లు దెబ్బతిన్నాయని తెలిపారు. ఈ వర్షాల కారణంగా 600కు పైగా ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయని, 200 పశువులు మరణించినట్లు సమాచారం అందిం దన్నారు.

భారీ వర్షాలు, వరదలు మరిన్ని రోజులు కురుస్తాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ప్రకటించా రు. అఫ్గాన్‌లో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతోందని, వాతావరణం క్షీణిస్తుందని, దీనివల్ల ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి గతేడాది హెచ్చరించింది. కాగా ఫిబ్రవరిలో కొండచరియలు విరిగిపడడంతో 20 మంది, మార్చి లో సంభవించిన వరదల్లో 60 మంది మృతి చెందారు.