22 July, 2026 | 1:49 AM

బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల వల్లే మేడ్చల్ ప్రజలకు కష్టాలు

22-07-2026 12:39 AM

బీజేపీ నేత వంశీధర్ రెడ్డి 

మేడ్చల్ అర్బన్, జూలై 21 (విజయక్రాం తి): బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల అసమర్ధత, స్వార్థం వల్లే మేడ్చల్ పట్టణ ప్రజలు ఇబ్బందు లు ఎదుర్కొంటున్నారని బిజెపి నాయకుడు వంశీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యా యని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నా యకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేకపోతున్నారన్నారు.

రైల్వే స్టేషన్ రోడ్డు, కెఎల్‌ఆర్ కు వెళ్లే శివాలయం, కోర్టు రోడ్డు, కిష్టాపూర్ రోడ్లు గుంతల మయంగా ఉన్నాయన్నారు. డ్రైనేజీ పొంగి రోడ్లమీద ప్రవహిస్తోందన్నారు. గతం లో అధికారంలో ఉన్న బిఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధి చేయలేకపోయారని, ప్రస్తుతం కాంగ్రెస్ నాయ కులు కూడా అభివృద్ధిని విస్మరిస్తున్నారని ఆయన విమర్శించారు.

గత పాలకవర్గం పదవీకాలం ముగిసే సమయంలో ఆదరాబాదరగా పనులు చేపట్టడం వల్ల కొన్ని రోజులకే ధ్వంసం అయ్యాయన్నారు.   ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కళ్ళు తెరిచి అభివృద్ధి పనులకు నిధులు మంజూ రు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.