బాలికల విద్యాభివృద్ధికి అందరూ తోడ్పడాలి
22-07-2026 01:32 AM
కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, జూలై 21 (విజయక్రాంతి) : బాలికల ఉన్నత విద్యకు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలవడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. మంగళవారం విలేజెస్ ఇన్ పార్ట్నర్షిప్ (వి ఐ పి ) సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రతిభా పురస్కారాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన జిల్లా వ్యాప్తంగా 15 మంది విద్యార్థినులను ప్రశంసాపత్రాలు, నగదు బహుమతులు, మొక్కలతో సత్కరించారు.
విద్యార్థినులు కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య, జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారి సుధారాణి, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రంజిత్ రెడ్డి, వి ఐ పి వ్యవస్థాపకులు నాగేంద్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.






