పేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యం: చంద్రకాంత్ రెడ్డి
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలంలోని ర్యాగట్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద నిర్మించిన 40 నూతన గృహాలను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు అందించి వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్వో, ఎంపీడీవో, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు భీమ్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీరామ్ వెంకటేష్, జిల్లా కార్యదర్శి లింగాల రాజబాబు గౌడ్, గ్రామ సర్పంచ్, గ్రామ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు. 40 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహప్రవేశాలు చేయడం పట్ల గ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.






