17 August, 2026 | 2:11 PM

ట్రాక్టర్_బైక్ ఢీ ఒకరు మృతి

17-08-2026 01:00 PM

అశ్వారావుపేట,(విజయక్రాంతి) : ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఢీకొన్న సంఘటనలో ఒకరు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం లోని జమ్మిగూడెం సమీపం లో జరిగిన రోడ్డు ప్రమాదంలో  ద్విచక్రవాహనంపై ఇంటికి వస్తున్న కేశాప్పగూడెం కు చెందిన మలం నాగరాజు (23) అనే వ్యక్తి అక్కడక్కడే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. అశ్వారావుపేట ఎస్ ఐ యయాతి రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు.  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ ఐ తెలిపారు.