10 May, 2026 | 5:49 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

సర్వీస్ రోడ్ల ఆక్రమణల తొలగింపు

03-03-2026 12:52 AM

రోడ్లను ఆక్రమిస్తే కూల్చివేస్తాం 

జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారుల హెచ్చరిక 

ఎల్బీనగర్, మార్చి 2 : రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు నిర్వహిస్తే కూల్చివేస్తా మని జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ అధికారులు హెచ్చరించారు. చైతన్యపురి నుంచి సరూర్ నగర్ రైతు బజార్, గ్రీన్ హిల్స్ కాలనీ, అష్టలక్ష్మి కమాన్ వరకు ఉన్న సర్వీస్ రోడ్లపై ఆక్రమించుకొని చిరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. దీంతో నిత్యం ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులతో సోమవారం జీహెచ్‌ఎంసీ సరూర్ నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా కూల్చివేతలు చేపట్టి, నిర్మాణాలను తొలిగించారు. ఆక్రమణలు తొలగించడంపై స్థాని కులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.