ఆసరా గోడ పత్రికల విడుదల
గద్వాల: ఈనెల 15న ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకుని అడ్వకేట్ అసోసియేషన్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అండ్ అవేర్‌నెస్ (ఆసరా) సంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన గోడపత్రికలను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినియోగదారులు తమ హక్కుల గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలి.
కల్తీ ఆహారం, నకిలీ ఉత్పత్తులు, అన్యాయ వ్యాపార విధానాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వంతో పాటు సామాజిక సంస్థలు కూడా సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి స్వామి కుమార్, ఆసరా జిల్లా అధ్యక్షుడు రంగు భరత్, సంస్థ కార్యదర్శి మహేష్, ఉపాధ్యక్షుడు జగదీష్ పాల్గొన్నారు.




