13 August, 2026 | 7:33 AM

రేకుర్తి పట్టా భూములను నిషేధిత జాబితా నుండి తొలగించాలి

13-08-2026 01:30 AM

 అదనపు కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించిన కార్పోరేటర్లు 

కొత్తపల్లి, ఆగస్టు12(విజయక్రాంతి):రేకుర్తి విద్యానగర్ పట్టా భూములపై విధించిన 22/A పై సత్వరమే విచారణ జరిపి రేకుర్తి విద్యానగర్ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు ,జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి కి కలిసి ప్రజల బాధలను విన్నవించి రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరించాలని వినతి పత్రం అందించారు 19వ డివిజన్ కార్పొరేటర్ సుధగోని.మాధవి-కృష్ణగౌడ్ , 20వ డివిజన్ కార్పొరేటర్ పర్వతం మల్లేషం , 21వ డివిజన్ కార్పొరేటర్ వరాల నర్సింగం. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎదుల్ల రాజశేఖర్ , రేకుర్తి విద్యానగర్ కాలనీ ల ప్రజలు నాయకులు పాల్గొన్నారు.