10 August, 2026 | 5:01 AM

కాంగ్రెస్‌లోకి రేఖ్యతండా సర్పంచ్

10-08-2026 12:45 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి సమక్షంలో పార్టీలో చేరిక

కడ్తాల్, అగస్టు 9(విజయక్రాంతి): కల్వకుర్తి ఎమ్మెల్యే శ్రీ కసిరెడ్డి నారాయణరెడ్డి సమక్షంలో కడ్తాల్ మండలం రేఖ్యతాండ గ్రామ పంచాయతీ సర్పంచ్  పాత్లావత్ లక్ష్మి శ్రీధర్, వార్డు సభ్యులు లలిత, శ్రీను, ఎస్. విజయ, కృష్ణ మరియు పలువురు నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఎమ్మెల్యే  వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి సాధరంగా పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రజాపాలనను చూసే ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు కాంగ్రెస్లో చేరుతున్నారన్నారు. పార్టీలో చేరిన నాయకులు గ్రామస్థాయిలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు శ్రీనివాస్ గౌడ్ , శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు.