22 August, 2026 | 2:57 AM

త్వరలో హోర్ముజ్‌పై పూర్తి నియంత్రణ

22-08-2026 02:01 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

హెచ్చరికలకు భయపడేదే లేదు: ఇరాన్

వాషింగ్టన్, ఆగస్టు 21: త్వరలో హోర్ముజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ సాధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ సైనిక దళానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. వారి ఆయుధ సంపత్తి నిండు కొచ్చిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌ను అణ్వాయుధాలు అభివృద్ధి చేసుకోనీయబోమని ట్రంప్ స్పష్టం చేశారు. తాజాగా ట్రంప్ ఓ మీడియా ఛానల్‌తో మాట్లాడు తూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందని చెప్పారు.

ప్రభుత్వ ఉద్యోగులు, సైనికులకు వేతనాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని విమర్శించారు. కొత్త ఒప్పందాలపై చర్చలు జరపడం కష్టంగా మారిందని, చాలామంది అగ్రనాయకులు ఇప్పుడు జీవించి లేరన్నారు. ఆ దేశంలో ఎవరు సంపూర్ణమైన నిర్ణయాలు, బాధ్యతలు తీసుకుంటారనేది అస్పష్టంగా ఉందన్నారు. కాగా ఒకరోజు ముందు అమెరికా ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సాంట్ ఇరాన్‌తో వ్యాపారలావాదేవీలు జరిపే దేశా లు, సంస్థలపై కఠిన ఆర్థిక చర్యలు తప్పవని హెచ్చరించారు.

ట్రంప్ ప్రకటనపై ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. అమెరికా హెచ్చరికలకు భయపడ బోమన్నారు. ఇరాన్ ఎన్నో ఏళ్లుగా ఇలాంటి ఆంక్షలను ఎదుర్కొంటోందని చెప్పారు. చర్చలకు సిద్ధంగా లేనప్పుడు అమెరికా ఇలా ంటి ఆంక్షలను విధిస్తుందని ఆరోపించారు. కాగా అమెరికా ఆం క్షలపై నిపుణులు మా ట్లాడుతూ.. ఇరాన్‌పై ఆంక్షలతో ఆ దేశం లొంగే ఆస్కారం ఉండకపోగా ప్రపంచదేశా లు కూడా ఈ ఆంక్షలను భరించడం కష్టమవుతుందని, దీంతో ప్రపంచం ఆర్థికమాం ద్యం వైపు దారితీసే అవకాశం కూడా లేకపోలేదని ప్రకటించారు.