ఆయిల్ పామ్ గెలల రికార్డు ధర
01-06-2026 06:08 PM
దమ్మపేట,(విజయక్రాంతి): మే నెల పామ్ ఆయిల్ గెలల ధర టన్నుకు రూ.351/- పెరిగినట్లు ఆయిల్ ఫెడ్ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో పామ్ ఆయిల్ గెలల ధర టన్నుకు రూ.23,501/– లు ఉండగా, మే నెలకు పామ్ ఆయిల్ గెలల ధర టన్నుకు ₹23,852/- గా ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రకటించారు. ఆయిల్ పామ్ గెలల ధర ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్ అని పామ్ ఆయిల్ రైతులు ఆనందం వ్యక్తం చేస్తూ, త్వరలో టన్ను పామ్ ఆయిల్ గెలల ధర రూ 25,000/- లకు చేరుకుంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.






