1 June, 2026 | 7:05 PM

19వ డివిజన్‌లో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు పనులకు భూమిపూజ

01-06-2026 06:05 PM

ముకరంపుర,(విజయక్రాంతి): కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 19వ డివిజన్,రేకుర్తి హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 11లో నూతనంగా నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు సోమవారం  భూమిపూజ నిర్వహించారు. మున్సిపల్ సాధారణ నిధుల నుండి రూ. 10 లక్షల వ్యయంతో ఈ రోడ్డు నిర్మాణ పనులను చేపట్టనున్నారు.

ఈ అభివృద్ధి కార్యక్రమానికి కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్  కొలగాని శ్రీనివాస్ మరియు బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ మరియు  యాదగిరి సునీల్ రావు  ముఖ్య అతిథులుగా హాజరై, భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుధాగోని మాధవి-కృష్ణ గౌడ్ 19వ డివిజన్ కార్పొరేటర్, మున్సిపల్ అధికారులు, స్థానిక నాయకులు, హనుమాన్ నగర్ రోడ్ నెంబర్ 11 కాలనీ వాసులు మరియు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.