వివోఏలకు బిఆర్ఎస్ మద్దతు
చందుర్తి,(విజయక్రాంతి): మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష చేస్తున్న వీవోఏ లకు బిఆర్ఎస్ మండల నాయకులు మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వీవోఏలకు వెంటనే అమలు చేయాలని, అలాగే కనీస వేతనం కల్పించి అన్ని విధాలా ప్రభుత్వం ఆదుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా మండుటెండలో దీక్షలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే వీవోఏల సమస్యలను పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ హామీలలో వివోఏలకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ హెచ్ఆర్ విధానం కల్పిస్తామని మాట ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పటి పంచాయతీరాజ్ శాఖలో ఉన్న సీతక్క 26000 పెంచాలని అడిగి,ఇప్పుడు పంచాయతీరాజ్ శాఖలో ఉన్న సీతక్క వారికి గౌరవ వేతనం ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మండల బిఅర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.






