బ్లాస్ట్ చేయడానికి సిద్ధం!
టాలీవుడ్ యంగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ ‘కన్నప్ప’ చిత్రం తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుం డా ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లోనూ క్రేజీ ఆఫర్లు అందుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. ఈ బ్యూటీ యాక్ష న్ కింగ్ అర్జున్ సర్జాతో కలిసి నటించే అవకాశాన్ని దక్కించుకుం ది. అర్జున్ సర్జా ఇప్పుడు మళ్లీ తన మార్క్ యాక్షన్ హీరోగా మారబోతున్నారు.
ప్రదీప్ అసిస్టెంట్ డైరెక్ట ర్‌గా పనిచేసిన యువ దర్శకుడు సుభాష్‌కే ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెం ట్ దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘బ్లాస్ట్’ అ నే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో అర్జున్ సరసన సీనియర్ నటి అభిరామి నటిస్తుండగా, ప్రీతి ముకుందన్ అర్జున్ కూతురి పాత్రలో కనిపించనుంది. కేవలం యాక్షన్ సిని మా మాత్రమే కాకుండా, తండ్రీ కూతుళ్ల మధ్య ఉండే భావోద్వేగ బంధం చుట్టూ తిరిగే సెంటిమెంట్ డ్రామాగా రూపొందుతోందీ సినిమా.
ప్రీతి పాత్రకు ఈ కథలో చాలా ప్రాముఖ్యత ఉందని సమాచారం. తాజాగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్‌లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ‘బ్లాస్ట్ చేయడానికి అన్నీ సిద్ధంగా ఉన్నాయి.. త్వరలోనే థియేటర్లలోకి రాబోతున్నాం’ అంటూ ప్రీతి ఈ పోస్టర్‌ను సోషల్ మీడియా లో పంచుకుంది. ఈ పోస్టర్‌లో అర్జున్ ఒక పెద్ద కత్తితో మాస్ లుక్‌లో కనిపిస్తుండగా, అభిరామి చేతిలో పెద్ద సుత్తి పట్టుకుని ఎంతో కోపంగా చూస్తోంది.
ఇక ప్రీతి ముకుందన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ కరాటే భంగి మలో కనిపిస్తోంది. వీరి చుట్టూ విలన్లు దెబ్బలు తిని పడి ఉన్న విజువల్స్ చూస్తుంటే, సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ఉన్నాయని అర్థమవుతోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్నట్లు తెలుస్తోంది.






