ఆందోళనకారులతో చర్చకు సిద్ధం
- ‘రిజర్వేషన్స్ హటావో’పై కేంద్రం స్పందన
- ఒక కేంద్ర మంత్రితో భేటీకి అవకాశం
న్యూఢిల్లీ, ఆగస్టు ౨౨: ‘రిజర్వేషన్స్ హటా వో’ నినాదంతో ఢిల్లీ వేదికగా ఆందోళనకా రులు చేపడుతున్న ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారుల కు చర్చకు సిద్ధమని ప్రకటించింది. ఈ విష యంపై ఆందోళనకారులు కూడా స్పష్టతని చ్చారు. కేంద్ర మంత్రుల్లో ఒకరు తమతో స్వ యంగా చర్చిస్తారనే హామీ తమ వరకూ వ చ్చిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం చర్చల కు సిద్ధమైనంత మాత్రాన తమ పోరాటం ముగిసిపోలేదని, తమ డిమాండ్లు పూర్తిగా నెరవేరే వరకు ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
కేంద్ర మంత్రితో జరగబో యే చర్చల్లో ముఖ్యనేతలు అజీత్ భారతి, ఆనంద్ రంగనాథన్, నేహా లాల్‌దాస్ పాల్గొ ననున్నారని వెల్లడించారు. దేశంలో రిజర్వేష న్లు అమలవుతున్న తీరుపై తమ వద్ద పూర్తి గణాంకాలు ఉన్నాయని, వాటన్నింటినీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.






