23 August, 2026 | 3:13 AM

అనలాగ్ పన్నీర్‌పై నిషేధం

23-08-2026 12:45 AM

కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం

బెంగళూరు, ఆగస్టు 22: అనలాగ్ పన్నీర్ తో తీవ్రమైన ఆరోగ్య సమస్యల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కర్ణాటకలో విక్రయాలపై ఏడాదిపాటు నిషేధం విధిస్తున్న ‘కర్ణాటక ఆహార భద్రతా శాఖ’ శనివారం ఓ ప్రకటించింది. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన తనిఖీలు, నమూనా పరీక్షల్లో అస లైన పన్నీర్‌కు బదులుగా అనలాగ్ పన్నీరు ను వినియోగిస్తున్నట్లు తేలడంతో ఈ నిర్ణ యం తీసుకుంది. నిషేధం 2027 ఆగస్ట్ 17 వరకు అమలులో ఉంటుందని తెలిపింది.

నిషేధం నేపథ్యంలో ఎవరైనా అనలాగ్ పన్నీర్ విక్రయాలు జరిపినట్లు తేలితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పన్నీర్‌ను కొనుగోలు చేసేముందే వి నియోగదారులు అన్ని వివరాలను సరిచూసుకొని పరిశీలించి పాలతో తయారైన స్వ చ్ఛత ఉన్న పన్నీర్‌నే కొనుగోలు చేయాలని సూచించింది.

నకిలీ ఉత్పత్తులు కొనుగో లు చేస్తూ వినియోగదారులు మోసపోవద్దని కో రింది. కాగా దేశవ్యాప్తంగా పలుచోట్ల జంతువుల కొవ్వు నూనె, పామాయిల్, కల్తీ పాల పొడితో అనలాగ్ పన్నీర్‌ను తయారు చేస్తూ విక్రయాలు జరుపుతున్నట్లు ఆహార భ ద్రతా సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోనూ ఈ రకమైన తయారీ, విక్రయా లపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిషేధం విధించింది.