13 August, 2026 | 3:44 AM

ప్రారంభానికి సిద్ధం.. వర్చువల్‌గా నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్న సీఎం

13-08-2026 01:19 AM

కరీంనగర్, ఆగస్టు12(విజయక్రాంతి)కరీంనగర్ నూతన కలెక్టరేట్ ప్రారంభానికి సిద్దంయింది ఈ నెల 16 న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ములుగు కలెక్టరేట్ తో పాటు కరీంనగర్ కలెక్టరేట్ ను వర్చువల్ గా ప్రారంభించే అవకాశం వుంది.అన్ని వసతులతో ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు కలెక్టర్ చిత్రా మిశ్రా ఆదేషించారు. జిల్లా కలెక్టరేట్ భవనానికి కార్యాల యాల తరలింపు ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నారు. పాత కలెక్టరేట్ నుంచి తరలించే ఫైళ్లు, ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామగ్రి దెబ్బతినకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు .

గ్రౌండ్, మొదటి, రెండో అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్న వివిధ శాఖల కార్యాలయాలు, అధికారుల ఛాంబర్లు, అడిషనల్ కలెక్టర్ల కార్యాలయాలు, సమావేశ మందిరాలు, వీవీఐపీ గదులు సిద్ధమైనాయి. ప్రతి బ్లాక్కు సంబంధించిన కార్యాలయాల వివరాలను డయాగ్రామ్ రూపంలో సిద్ధం చేఅంటున్నారు. ఆర్. ఏ శాఖ ఎక్కడ పనిచేయనుందో స్పష్టంగా కనిపించేలా కార్యాల యాల కేటాయింపు చేపట్టారు.. కలెక్టరేట్లో పనిచేసే అధికారులు, ఉద్యోగుల వివరాలను సేకరించి, ప్రణాళిక ప్రకారం సిట్టింగ్ ఏర్పాటు ప్రస్తుతం సాగుతుంది.

లయన్ డిపార్ట్మెంట్లకు సంబంధించి ఒకటే చోట ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.కార్యాలయాల్లో ఏసీలు, ఫర్నిచర్, కర్టెన్లు, విద్యుత్, తాగునీటి సదుపాయం, టీ-ఫైబర్ నెట్వర్క్ తదితర అన్ని మౌలిక వసతులు ప్రారంభానికి ముందే సిద్ధం చస్తున్నారు. . మీటింగ్ హాల్తో పాటు వీవీఐపీల సమావేశాలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నా యి.మొత్తం మూడు అంతస్తులో కలిపి 46 శాఖలు రానున్నాయి.

కలెక్టరేట్కు వచ్చే వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఇతర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించాలని  నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని షిఫ్టింగ్ ప్రక్రియను ప్రశాంతంగా, వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేసి నూతన కలెక్టరేట్ను ప్రారంభానికి సిద్ధం చేయాలని పేర్కొన్నారు. పాత కలెక్టరేట్ భవనానికి సంబంధించిన రిపేర్లు చేపట్టాలని ఆదేశించారు. కొత్త కలెక్టరేట్ భవనానికి సంబంధించిన పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు.

ఆకర్షణీయంగా ఆర్చి

 నూతన కలెక్టరేట్లో నిర్మిస్తున్న ఆర్చి ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ప్రధాన గేటు నిర్మాణంతో పాటు రహదారి, ల్యాండ్స్కేపింగ్, పచ్చదనం, ఇతర మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. , కలెక్టరేట్కు వచ్చే ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఆర్చి నిర్మాణం చేపట్టారు .