బెల్లల్ ఇందిరమ్మ కాలనీలో ఆర్డీవో తహసీల్దార్ పరిశీలన
21-08-2026 09:14 PM
బోధన్,(విజయక్రాంతి): బోధన్ మండలంలోని బెల్లల్ ఇందిరమ్మ కాలనీలో ఇళ్ల పైకప్పులు కురుస్తున్న నేపథ్యంలో బాధితులకు రేకులు ఏర్పాటు చేసే చర్యల్లో భాగంగా ఆర్డీవో ఎం.విజయకుమారి, తహసీల్దార్ విఠల్ శుక్రవారం కాలనీని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు అధికారులు కాలనీకి వెళ్లి ఇళ్లను పరిశీలించారు. ఇళ్ల పరిస్థితి, వర్షాల కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చర్యలు చేపట్టి పైకప్పులకు రేకులు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.






