22 April, 2026 | 2:11 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

నీరుకుల్లా సమ్మక్క జాతర ఏర్పాట్లను పరిశీలించిన ఆర్డిఓ

23-01-2026 01:32 PM

సుల్తానాబాద్, జనవరి 23 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని నీరుకుళ్ళ మానేటి రంగనాయక స్వామి ఆలయ ఆవరణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఏర్పాట్లను శుక్రవారం పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్య పరిశీలించారు. జాతర జరుగు ప్రదేశాన్ని కలియ తిరుగుతూ పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు హాజరు కావడం జరుగుతుందని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. పారిశుద్ధ నిర్వహణ ఎప్పటికప్పుడు చేపట్టాలని సూచించారు.

త్రాగునీరు ,విద్యుత్ లైట్లు,  భక్తులకు వసతులు,  స్థాన ఘట్టాలు, క్యూలైన్ ద్వారా మోక్కులను చెక్కిలించుకునే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. జాతర జరిగే ప్రాంతంలో అన్ని విభాగాల అధికారులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఈ కార్యక్రమం లో తాసిల్దార్ బషీరుద్దీన్, ఎస్ఐ చంద్రకుమార్, ఎంపీడీవో దివ్య దర్శన్ రావు, జాతర కమిటీ చైర్మన్ పొన్నం చంద్రయ్య గౌడ్, ఈఓ శంకరయ్య , సర్పంచ్ కాంపల్లి సతీష్, ఆర్ఐ వినోద్ ,కార్యదర్శి సునీత, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, జిపిఓ శ్రీనివాస్  జాతర కమిటీ సభ్యులు, తదితరులున్నారు....